చుక్కల్ని తాకిన పవన్ కల్యాణ్ కొత్త సినిమా బిజినెస్

Published On: July 17, 2017   |   Posted By:

చుక్కల్ని తాకిన పవన్ కల్యాణ్ కొత్త సినిమా బిజినెస్

సినిమా రిలీజ్ అయ్యాక రికార్డులు సృష్టించడం, వసూళ్లు రాబట్టడం కామన్. అందులో హీరో స్టామినా తెలీదు. దర్శకుడికి కూడా షేర్ వెళ్తుంది. కానీ విడుదలకు ముందే ఓ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ చేసిందంటే కచ్చితంగా అది హీరో స్టామినా గానే అర్థం చేసుకోవాలి. అలాంటి సత్తానే మరోసారి చాటాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేయలేదు. కానీ ప్రీ-రిలీజ్ బిజినెస్ మాత్రం కళ్లుతిరిగే రేంజ్ లో పూర్తయింది. అవును.. ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో పవన్ సినిమా ఏకంగా 90 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ బిజినెస్ మొత్తం 120 కోట్ల రూపాయల పైమాటే.

ఇక్కడితో ఆగలేదు లెక్క. శాటిలైట్ రైట్స్ కూడా రిలీజ్ కు ముంద పూర్తయ్యాయి. ఆడియో హక్కులు కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. సోషల్ మీడియా రైట్స్ కూడా అమ్మేశారు. ప్రస్తుతానికైతే వీటిని ప్రీ-రిలీజ్ బిజినెస్ కింద జమకట్టడం లేదు. ఇవి కూడా కలుపుకుంటే పవన్ సినిమా దాదాపు 150 కోట్ల రూపాయలకు పైగానే ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్టు లెక్క.