చెర్రీ, బోయపాటి సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్

Published On: February 21, 2018   |   Posted By:
చెర్రీ, బోయపాటి సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్
చెర్రీ, బోయపాటి సినిమాకు రూ.22 కోట్లు
ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే రామ్ చరణ్, బోయపాటి సినిమాకు 22 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఇంత మొత్తాన్ని ఇచ్చేందుకు ఓ నేషనల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ముందుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి దీనిపై ఇంకా అగ్రిమెంట్ పూర్తవ్వలేదు.
నార్త్ లో మాస్-యాక్షన్ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. బి, సి సెంటర్లలో తెలుగు సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్లకు మంచి డిమాండ్ ఉంది. పైగా బోయపాటి సినిమాలకు ఉత్తరాది రూరల్ ఏరియాస్ లో విపరీతమైన డిమాండ్. అది కూడా రామ్ చరణ్ కాంబినేషన్ లో అనేసరికి రేటు 22 కోట్లు పలికింది.
త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి మేకోవర్ పనిలో ఉన్నాడు రామ్ చరణ్. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.