చోర్ బజార్ చిత్రం ప్రారంభO

Published On: February 18, 2021   |   Posted By:

చోర్ బజార్ చిత్రం ప్రారంభO

“జార్జ్ రెడ్డి” దర్శకుడు జీవన్ రెడ్డితో ఆకాష్ పూరీ “చోర్ బజార్” 

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు యువ హీరో ఆకాష్ పూరీ తన మూడో చిత్రాన్ని కన్ఫర్మ్ చేశారు. “జార్జ్ రెడ్డి”  తో విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి ఇన్ స్ఫైరింగ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆకాష్ పూరీ, జీవన్ రెడ్డి కాంబినేషన్ చిత్రానికి “చోర్ బజార్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. దొంగిలించిన వస్తువులన్నీ చోర్ బజార్ కు చేరుతుంటాయి. అయితే ఈ కథను అంతా ఊహించినట్లు కాకుండా విభిన్నంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు.

“చోర్ బజార్” సినిమా గురువారం  హైదరాబాద్ లోని ప్రొడక్షన్ ఆఫీస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో ఆకాశ్ పై సోదరి పవిత్ర పూరి క్లాప్ ఇవ్వగా తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. ఐ.వి ఎస్.ఎన్ రాజు ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించారు. బాలు మున్నంగి స్క్రిప్ట్ ను అందించారు. వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” చిత్రంలో సుబ్బరాజు, పోసాని,  “లేడీస్ టైలర్” ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

“చోర్ బజార్” సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది.

సినిమాటోగ్రఫీ – జగదీష్ చీకటి, 

సంగీతం – సురేష్ బొబ్బిలి, 
ఎడిటింగ్ – సత్య గిడుటూరి, 
ఆర్ట్ – గాంధీ నడికుడికర్, 
మేకప్ – శివ, 
కాస్ట్యూమ్స్ డిజైనర్ – ప్రసన్న దంతులూరి, 
కాస్ట్యూమ్ చీఫ్ – శ్రీనివాస్, 
ఫైట్స్ – ఫృథ్వీ శేఖర్, 
కొరియోగ్రఫీ – భాను, 
బ్యానర్ – వీ ప్రొడక్షన్స్, 
నిర్మాత – వీ.ఎస్ రాజు, 
సహ నిర్మాత – అల్లూరి సురేష్ వర్మ, 
రచన, దర్శకత్వం – బి. జీవన్ రెడ్డి.