ఛలో ట్రయిలర్ రివ్యూ

Published On: January 18, 2018   |   Posted By:

ఛలో ట్రయిలర్ రివ్యూ


నాగశౌర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఛలో. ఈ సినిమా ట్రయిలర్ ఈరోజు లాంఛ్ అయింది. త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన వెంకీ కుడముల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాగశౌర్య అమ్మానాన్న నిర్మాతలుగా మారి ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.

ట్రయిలర్ పక్కాగా కామెడీ ట్రాక్ లోనే నడిచింది. తమిళనాడు-ఆంధ్ర బోర్డర్ లో కథ నడుస్తుంది. రెండు వర్గాలు.. తమ  భాషలు, సినిమాలు, యాసలు, ఇతర వ్యవహారాలపై చాలా పట్టుగా ఉంటాయి. ఈ రెండు వర్గాల మధ్య గొడవలు, పంతాలను ఫన్నీగా చూపించారు. ఇలా రెండు వర్గాలు, రెండు ఊళ్ల మధ్య నలిగిపోయే ప్రేమ జంట కథే ఈ ఛలో అనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

రష్మిక ఈ సినిమాతో తెలుగుతెరకు హీరోయిన్ గా పరిచయమౌతోంది. మణిశర్మ తనయుడు మహతి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటికే పాటలతో ఎట్రాక్ట్ చేసిన ఈ సంగీత దర్శకుడు.. రీరికార్డింగ్ లో కూడా తన చమక్కు చూపించాడు. విలియమ్స్ కెమెరా వర్క్ బాగుంది. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది ఛలో మూవీ.