ఛలో మూవీ లేటెస్ట్ కలెక్షన్లు

Published On: February 21, 2018   |   Posted By:
ఛలో మూవీ లేటెస్ట్ కలెక్షన్లు
నాగశౌర్య, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఛలో సినిమా 2 వారాలు పూర్తయినా ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా విడుదలై 17 రోజులైనా ఇంకా వసూళ్లు సాధిస్తుండడం విశేషం. అటు నైజాంలో ఈ సినిమాను సొంతంగా విడుదల చేసిన ఐరా క్రియేషన్స్ కు మరో 3 రోజుల్లో ఓవర్-ఫ్లోస్ కూడా ప్రారంభంకాబోతున్నాయి. ఏపీ, నైజాంలో ఛలో 17 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి.
ఏపీ, నైజాం 17 రోజుల షేర్
నైజాం – రూ. 2.87 కోట్లు
సీడెడ్ – రూ. 1.12 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.42 కోట్లు
ఈస్ట్ – రూ. 0.72 కోట్లు
వెస్ట్ – రూ. 0.54 కోట్లు
గుంటూరు – రూ. 0.65 కోట్లు
కృష్ణా – రూ. 0.76 కోట్లు
నెల్లూరు – రూ. 0.27 కోట్లు
ఏపీ, నైజాం టోటల్ షేర్ – రూ. 8.35 కోట్లు