ఛలో  హీరోయిన్  హలో అంటుందా

Published On: April 16, 2018   |   Posted By:
ఛలో  హీరోయిన్  హలో అంటుందా
కన్నడంలో విడుద‌లైన ’కిరిక్ పార్టీ’తో హీరోయిన్‌గా మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది ర‌ష్మిక మండ‌న్నా. త‌ర్వాత నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తూ నిర్మించిన `ఛ‌లో` సినిమాతో తెలుగు చిత్రసీమ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఛ‌లో మంచి స‌క్సెస్ సాధించ‌డంతో వ‌రుస సినిమా అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రెండు సినిమాలు.. నాగార్జున‌, నాని మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టిస్తుంది. అయితే ఇప్పుడు మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. అదే అఖిల్‌, వెంకీ అట్లూరి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమాలో న‌టించే అవ‌కాశం. ప్ర‌స్తుతం ఈసినిమాకు సంబంధించిన క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. త్వ‌ర‌లోనే అఖిల్ సినిమా హీరోయిన్ గురించి క్లారిటీ రానుంది.