ఛల్ మోహన్ రంగ టీజర్ రివ్యూ

Published On: February 14, 2018   |   Posted By:
ఛల్ మోహన్ రంగ టీజర్ రివ్యూ

లై సినిమా తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకొని నితిన్ చేసిన మూవీ ఛల్ మోహన్ రంగ. ఈ సినిమా ఎంత స్పెషలో మనకు తెలీదు కానీ, పవన్-త్రివిక్రమ్ కలిసి నిర్మించడంతో ఈ మూవీ వెరీ వెరీ స్పెషల్ గా మారిపోయింది. వీళ్లిద్దరితో పాటు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజైంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉందో చూద్దాం.
“వర్షాకాలంలో కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకొని, వేసవికాలంలో విడిపోయాం.” ఈ ఒక్క డైలాగ్ తో ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అనే విషయం అర్థమౌతుంది. దీని వెంటనే మీరిద్దరూ వెదర్ రిపోర్టర్సా భయ్యా అంటూ వచ్చే డైలాగ్ వింటుంటే.. కచ్చితంగా కామెడీ ఉందని, త్రివిక్రమ్ మార్క్ ఉందని తెలుస్తోంది. వీటికి తోడు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు ఓ ఫ్రెష్ లుక్ తీసుకొచ్చింది. నితిన్-మేఘాఆకాష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా టీజర్ లో ఎట్రాక్ట్ చేసింది. ఓవరాల్ గా ఈ వాలంటైన్స్ డే కు ఛల్ మోహన్ రంగ టీజర్.. నితిన్ అభిమానులకు పెర్ ఫెక్ట్ గిఫ్ట్ అనిపించుకుంది.