జయ జానకి నాయక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు

Published On: August 16, 2017   |   Posted By:

జయ జానకి నాయక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు

బోయపాటి మేజిక్ పనిచేసింది. బి, సి సెంటర్లలో జయజానకి నాయక సినిమా దుమ్ముదులుపుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటకు మంచి మార్కులు పడ్డంతో పాటు.. ప్రగ్యా జైశ్వాల్, క్యాథరీన్ అందాలకు యూత్ ఫిదా అయ్యారు. మరోవైపు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఉండనే ఉంది. అన్నీ కలిపి జయజానకి నాయక సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. మిగిలిన సినిమాలతో పోటీ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి థియేటర్లు కాస్త తగ్గినప్పటికీ.. వసూళ్లలో మాత్రం ఇది మిగతా సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా దూసుకుపోతోంది. మొదటి వీకెండ్ లో జయజానకి నాయక సినిమా వసూళ్లు ఇలా ఉన్నాయి. (షేర్ విలువ)

నైజాం – రూ. 2.55 కోట్లు

సీడెడ్ – రూ. 1.45 కోట్లు

వెస్ట్ – రూ. 0.55 కోట్లు

ఈస్ట్ – రూ. 0.58 కోట్లు

గుంటూరు – రూ. 0.85 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.  1.16 కోట్లు

కృష్ణ – రూ. 0.44 కోట్లు

నెల్లూరు – రూ. 0.44 కోట్లు

మొత్తం – రూ. 8.02 కోట్లు