జవాన్ కృష్ణా జిల్లా తాజా వసూళ్లు

Published On: December 6, 2017   |   Posted By:
జవాన్ కృష్ణా జిల్లా తాజా వసూళ్లు
సాయిధరమ్ తేజ్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జవాన్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే 7 కోట్ల 80లక్షల షేర్ సాధించింది. ప్రస్తుతం థియేటర్లలో స్టడీగా నడుస్తోంది. ఇక కృష్ణా ఏరియాకు సంబంధించి ఈ సినిమా లేటెస్ట్ వసూళ్లు వచ్చాయి
కృష్ణా  ఏరియాలో జవాన్ సినిమాకు మంగళవారం లక్షా 64 వేల రూపాయల షేర్ వచ్చింది. దీంతో కలుపుకొని ఈ 5 రోజుల్లో జవాన్ సినిమాకు కృష్ణా ప్రాంతంలో 52 లక్షల 18వేల రూపాయల షేర్ వచ్చింది. సినిమా సేఫ్ జోన్ లోకి రావాలంటే ఈ ఏరియాలో కోటి రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి. రాబోయే రోజుల్లో ఈ మొత్తం కలెక్ట్ అయ్యే అవకాశముంది.