జీవా ఇంట‌ర్య్వూ

Published On: February 4, 2020   |   Posted By:

జీవా ఇంట‌ర్య్వూ

`స్టాలిన్`  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే యాక్ష‌న్ఎంట‌ర్‌టైన‌ర్ – హీరో జీవా.
‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన జీవా హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `స్టాలిన్`. అందరివాడు ఉపశీర్షిక.  నవదీప్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో నటించడం విశేషం. రతిన శివ దర్శకత్వంలో   తమిళంలో వరుస హిట్ చిత్రాలను అందించిన వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థతో కలసి తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్, క్విటీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాయి. ప్రంపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ బాషలలో ఫిబ్రవరి 7న  భారీగా విడుదలకానున్న సందర్భంగా  జీవా ఇంట‌ర్య్వూ..

తెలుగులో `స్టాలిన్`చిరంజీవి టైటిల్ తో రావ‌డానికి రీజ‌న్ఏంటి?

– త‌మిళ టైటిల్ `సీర్‌`. అంటే గ‌ర్జ‌న‌. `స్టాలిన్`అనేది చిరంజీవిగారి సినిమా టైటిల్ కూడా కావ‌డంతో మాకు ఆడియ‌న్స్ అటెన్ష‌న్ కూడా ఉంటుంద‌నుకుంటున్నాం. ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ పేరు కూడా స్టాలినే. `అంద‌రివాడు` అనేది ఉప శీర్షిక‌. `అంద‌రివాడు` కూడా చిరంజీవిగారి సినిమా టైటిలే. నిర్మాత చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్ అయి ఉంటార‌ని నేను ఊహిస్తున్నాను. ఇటీవ‌ల వ‌చ్చిన కార్తి `ఖైదీ`కూడా చిరంజీవిగారి టైటిలే. మా సినిమా కూడా అంత‌టి ఘ‌న‌ విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను.

ఈ సినిమా క‌థాంశం గురించి?

– ఓ గ్రామంలో కుటుంబంతో సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువకుడు ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుంటాడు. అత‌ను ఎలాంటి స‌మ‌స్య‌లో చిక్కుకున్నాడు? ఈ స‌మ‌స్య‌కు మ‌హిళా సాధికారిత అంశం ఎలా లింక్ అయ్యింద‌న్న‌దే క‌థాంశం. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. మ‌హిళ‌ల‌కు సంబంధించిన అంశాల‌పై ద‌ర్శ‌కుడు చాలా ప‌రిశోధ‌న చేశాడు.కుటుంబ‌మంతా క‌లిసి చిత్రం ఇది.

`స్టాలిన్` సినిమా ఏ జోన‌ర్‌లో ఉంటుంది?

-ఈ సినిమాలో యాక్ష‌న్, ఫ్యామిలీ సెంటిమెంట్‌, ఫ్రెండ్‌షిప్‌, ఎమోష‌న్స్ ఇలా అన్ని అంశాలు మిళిత‌మై ఉన్నాయి.  మ‌హిళా సాధికార‌త వంటి  సామాజిక అంశాల‌ను కూడా ప్ర‌స్తావించాం.  మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. యూత్ కెనెక్ట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేందుకు వాణిజ్య అంశాల‌ను కూడా జోడించాం. ఈ సినిమాకు ప్రేక్ష‌కులు త‌ప్ప‌క రిలేట్ అవుతారు.

రంగం తర్వాత తమిళ్, తెలుగులో ఒకే రోజు విడుదలవుతున్న సినిమా కదా?

 – అవును!   నేను న‌టించిన `రంగం` సినిమాకు తెలుగులో మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. మ‌ళ్ళీ  తెలుగు ప్రేక్ష‌కుల‌కు కావాల‌సిన అంశాల‌న్ని ఈ సినిమాలో ఉన్నాయి. తెలుగు నేటివిటీ, తెలుగు ప్రేక్ష‌కులును దృష్టిలో ఉంచుకునే ఈ  చిత్రంలోని కొన్ని సీన్స్‌, డైలాగ్స్ ఉంటాయి. అందుకే  తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా న‌చ్చుతుంద‌ని గ్యారెంటీగా  చెప్ప‌గ‌ల‌ను. ఆ న‌మ్మ‌కంతోనే ఈ సినిమాను త‌మిళంతో పాటు తెలుగులో కూడా ఒకే స‌మ‌యంలో విడుద‌ల చేస్తున్నాం.

తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా  ఎప్పుడు చేస్తారు?

– తెలుగు ప్రేక్ష‌కులు సినిమా ల‌వ‌ర్స్‌.  కంటెంట్ బాగుంటే ఏ భాష సినిమానైనా ఆద‌రిస్తారు. నేను తెలుగు భాష‌ను అర్థం చేసుకోగ‌ల‌ను. త‌మిళంలో అయితే ఇంకా బాగా మాట్లాడ‌తాను. తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా చేయ‌డానికి మంచి క‌థ కుద‌రాలి. రంగం త‌ర్వాత స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలు చేసే మ‌ని నాన్న‌గారు చెబుతూనే ఉంటారు. కానీ త‌మిళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాను. మ‌న‌కు పూర్తిగా భాష తెలిసిన‌ప్పుడే  మంచి క‌థ‌ల‌ను ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది. నాకు తెలుగు అంత‌గా రాదు. నేను త‌మిళంలో మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. ఈ ఏడాది మూడు త‌మిళ‌ సినిమాలు విడుద‌ల అవుతాయి. వాటిలొ `జిప్సీ` చిత్రానికి ప్యాన్ ఇండియా అప్పీల్ ఉంది.

త‌మిళ సినిమాల‌కు తెలుగులో మంచి ఆద‌ర‌ణ ల‌బిస్తోంది క‌దా?

– తెలుగు సినిమా త‌మిళంలో విడుద‌లైనా, త‌మిళం సినిమా తెలుగులో విడుద‌లైనా ప్రేక్ష‌కుల‌నుండి మంచి స్పంద‌నే ల‌భిస్తోంది. సౌత్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ నార్త్‌లో వ‌ర్కౌట్ అవుతోంది. అక్క‌డి సినిమాలు ఇక్క‌డ కూడా ఆడుతున్నాయి. అల్లుఅర్జున్‌,  బాహుబ‌లి సినిమాల‌కు జాతీయ‌స్థాయిలో మంచి గుర్తుంపువ‌స్తున్నాయి. ఎక్క‌డైనా మంచి కంటెంట్‌కు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు.

మీకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది క‌దా! మీ సినిమాలు రెండు భాష‌ల్లో ఎందుకు రీలీజ్ చేయ‌డం లేదు?

– తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా చేయాల‌ని నాకు ఉంది. అన్ని భాష‌ల సినిమాల‌ను అన్ని ప్రాంతాల యాక్ట‌ర్స్‌, ప్రేక్ష‌కులు చూస్తున్నారు. ఇప్పుడు నేను ర‌ణ్‌వీర్‌సింగ్ 83 సినిమాలో క్రికెట‌ర్ కృష్ణ‌మాచార్య పాత్ర పోషించాను. ఇది కేవ‌లం బాలీవుడ్ సినిమా కాదు. ఒక ప్యాన్ ఇండియా సినిమా.  తెలుగు ప్రేక్ష‌కులు సినిమా ల‌వ‌ర్స్‌. అన్ని భాష‌ల సినిమాల‌ను ఆద‌రిస్తారు. 

భ‌విష్య‌త్‌లో డైరెక్ట‌ర్ అయ్యే ఆలోచ‌న ఉందా?

– ప్ర‌స్తుతం యాక్ట‌ర్‌గా సంతోషంగానే ఉన్నాను. భ‌విష్య‌త్‌లో డైరెక్ట‌ర్‌ని కావాల‌నుకుంటున్నాను. రైట‌ర్ కావాలంటే చాలా ఆలోచ‌న‌లు ఉండాలి. బాలీవుడ్‌, టాలీవుడ్ అని కాదు..టెక్నిషియ‌న్స్ అంద‌రూ బాలీవుడ్‌లో ఎక్కువ‌గా న‌టిస్తున్నారు. త‌మిళ యాక్ట‌ర్స్ తెలుగులో, తెలుగువారు త‌మిళంలో చేస్తున్నారు. ప్ర‌తిభ ముఖ్యం.