జులై 27న చి ల సౌ సినిమా విడుదల!

Published On: July 10, 2018   |   Posted By:

జులై 27న చి ల సౌ సినిమా విడుదల!

సుశాంత్ నటించిన ‘చి ల సౌ’ సినిమా జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

చి ల సౌ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ తో అనుబంధం ఏర్పరుచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యనుంది.

ఇటీవల విడుదలైన చి ల సౌ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

నటీనటులు:
సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్.

డైరెక్టర్: రాహుల్ రవీంద్రన్
బ్యానర్: సిరుని సినీ కార్పొరేషన్,అన్నపూర్ణ స్టూడియోస్,
నిర్మాత: జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయాలగుండ్ల
మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి. కెమెరామెన్: ఎం.సుకుమార్. ఎడిటర్: చోటా కె ప్రసాద్.ఆర్ట్: వినోద్ వర్మ.డైరెక్టర్: రాహుల్ రవీంద్రన్. నిర్మాతలు :-జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల. బ్యానర్: సిరుని సినీ కార్పొరేషన్,అన్నపూర్ణ స్టూడియోస్,

Leave a Reply

Your email address will not be published.