జూన్ నుండి షూటింగ్‌లో వెంకీ, వ‌రుణ్ చిత్రం

Published On: April 16, 2018   |   Posted By:

జూన్ నుండి షూటింగ్‌లో వెంకీ, వ‌రుణ్ చిత్రం

తేజ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా పెండింగ్ ప‌డ‌టంతో విక్ట‌రీ వెంక‌టేశ్ త‌దుప‌రి సినిమాను అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను స్టార్ట్ చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో వెంక‌టేశ్‌పాటు వ‌రుణ్ తేజ్ కూడా న‌టిస్తుండ‌టం విశేషం. ఈ మ‌ల్టీస్టారర్  ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులను జరుగుతుండగా.. తాజా సమాచారం ప్రకారం జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి ‘ఎఫ్ 2’(ఫన్ అండ్ ఫ్రస్టేషన్) అనే టైటిట్‌ని నిర్ణ‌యించారు.  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇక ఈ చిత్రంలో హీరోయిన్లుగా తమన్నా, మెహ్రీన్ పేర్లు విన‌ప‌డుతున్నాయి.  సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ పేరు వినిపిస్తోంది. అలాగూ వ‌రుణ్ తేజ్ అంత‌రిక్ష్యం నేప‌థ్యంతో సంక‌ల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు.