జై లవకుశ ఆడియో రిలీజ్ డీటెయిల్స్

Published On: August 30, 2017   |   Posted By:

జై లవకుశ ఆడియో రిలీజ్ డీటెయిల్స్

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వస్తోంది జై లవకుశ. అందుకే ఈ సినిమాపై అన్ని అంచనాలు. ఆ అంచనాలకు తగ్గట్టే తాజాగా విడుదలైన 2 టీజర్లు సూపర్ హిట్ అవ్వడంతో మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు జై లవకుశ యూనిట్ ఆడియోతో హల్ చల్ చేసేందుకు రెడీ అవుతోంది. సెప్టంబర్ 3న జై లవకుశ పాటలు విడుదల కాబోతున్నాయి.

ఆ రోజున జై లవకుశ పాటల్ని నేరుగా మార్కెట్లోకి, సోషల్ మీడియాలోకి విడుదల చేయబోతున్నారు. ఈవెంట్ పెట్టకపోవడానికి రీజన్ కూడా చెప్పారు. భారీ వర్షాలు పడుతుండడం, మరోవైపు గణేష్ నిమజ్జనం కూడా ఉండడంతో ఆడియో రిలీజ్ ఫంక్షన్ పెట్టడం లేదని స్పష్టంచేసింది యూనిట్.

అయితే ఆడియో సక్సెస్ మీట్ మాత్రం పెడుతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 10న అభిమానుల కోసం గ్రాండ్ ఈవెంట్ సెలబ్రేట్ చేయబోతున్నట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ప్రకటించింది. దాన్నే ఆడియో సక్సెస్ మీట్ అనుకోవాలి. ఇక విడుదలకు కొన్ని రోజుల ముందు ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

జై లవకుశ సినిమా సెప్టెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. నివేత థామస్, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు.