జై లవకుశ ఓవర్సీస్ వసూళ్లు

Published On: September 29, 2017   |   Posted By:

జై లవకుశ ఓవర్సీస్ వసూళ్లు

జై లవకుశ ఓవర్సీస్ వసూళ్లు.ఎన్టీఆర్ 3 డిఫరెంట్ గెటప్స్ లో నటించిన జై లవకుశ సినిమా సక్సెస్ ఫుల్ గా రెండో వారం లోకి ఎంటరైంది. ఓ వైపు మహేష్ స్పైడర్ నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ.. ఓవర్సీస్ లో ఈ సినిమా స్టడీగా కొనసాగుతోంది.

ఈ మధ్యే మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైన ఈ సినిమా తాజాగా తన వసూళ్లను ఇంకాస్త పెంచుకుంది. గురువారం వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ లో 1.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే మరో 10 రోజుల్లో 2 మిలియన్ క్లబ్ లోకి చేరుతుందని ట్రేడ్ ఎనలిస్ట్ లు అంచనా వేస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ తెరకెక్కిన ఈ సినిమా మరో 3 రోజుల్లో ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించనుంది. అటు నిర్మాతగా కల్యాణ్ రామ్ కు ఇప్పటికే లాభాలు తెచ్చిపెట్టింది జైలవకుశ సినిమా. ఇక వరల్డ్ వైడ్ వసూళ్ల పరంగా చూస్తే ఇప్పటికే వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా తాజాగా 132 కోట్ల రూపాయల గ్రాస్ తో బాహుబలి-2 తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్ లో వసూళ్ల పరంగా భారీ విజయం జనతా గ్యారేజ్ మాత్రమే. లాంగ్ రన్ లో ఆ చిత్రం సాధించిన రికార్డుల్ని జై లవకుశ క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.