జై లవకుశ నైజాం కలెక్షన్లు

Published On: October 3, 2017   |   Posted By:
జై లవకుశ నైజాం కలెక్షన్లు
ఎన్టీఆర్ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన జై లవకుశ సినిమా కళ్లుచెదిరే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఏపీ,నైజాంలో కూడా అదే రేంజ్ లో కాసుల వర్షం కురిపిస్తోంది.
శనివారానికి ఒక్క నైజాంలోనే జై లవకుశ సినిమా 15 కోట్ల రూపాయల షేర్ సాధించింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన జై లవకుశ మూవీ.. తాజా వసూళ్ల ప్రకారం 120 కోట్ల రూపాయల గ్రాస్ దాటేసింది. ఓవర్సీస్ లో ఈ సినిమా హవా కాస్త తగ్గినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, నైజాం, కర్ణాటకలో మాత్రం స్టడీగా వసూళ్లు వస్తున్నాయి.
జై లవకుశ సినిమాతో 150 కోట్ల రూపాయల వసూళ్లపై కన్నేశాడు ఎన్టీఆర్. అయితే ఆ ఘనత సాధించాలంటే ఇకపై కాస్త కష్టమనే చెప్పాలి. ఎందుకంటే దసరా పండగ సీజన్ తో పాటు లాంగ్ వీకెండ్ ముగిసింది. మంగళవారం నుంచి అంతా ఎవరి పనుల్లో వాళ్లు పడిపోతారు. సో.. ఈ సినిమా తన ఫైనల్ రన్ లో ఎంత సాధిస్తుందనేది అప్పుడే చెప్పలేం. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు.