జై లవకుశ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

Published On: September 26, 2017   |   Posted By:

జై లవకుశ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ వీకెండ్ దుమ్ముదులిపాడు. కళ్లుచెదిరే కలెక్షన్లు సాధించింది జై లవకుశ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూళ్లతో అదరగొట్టిన ఈ సినిమా.. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ డాలర్లు సంపాదించింది. అలా గ్రాండ్ గా ప్రారంభమైన జై లవకుశ సినిమా మొదటి 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 40 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 90కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో జై లవకుశ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు (షేర్)

నైజాం – రూ. 11.60 కోట్లు

సీడెడ్ – రూ. 8.10 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 4.19 కోట్లు

ఈస్ట్ – రూ. 4.14 కోట్లు

వెస్ట్ – రూ. 2.50 కోట్లు

గుంటూరు – రూ. 4.46 కోట్లు

కృష్ణా – రూ. 3.18 కోట్లు

నెల్లూరు – రూ. 1.69 కోట్లు

 

మొత్తం షేర్ – రూ. 39.86 కోట్లు