జై లవకుశ.. మూడో లుక్ కూడా వచ్చేసింది

Published On: August 26, 2017   |   Posted By:

జై లవకుశ.. మూడో లుక్ కూడా వచ్చేసింది

జై లవకుశలో ఎన్టీఆర్ 3 గెటప్స్ లో కనువిందు చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక పాత్ర పేరు జై. మరో పాత్ర పేరు లవకుమార్. ఈ రెండు గెటప్స్ కు సంబంధించి ఫస్ట్ లుక్స్ తో పాటు టీజర్స్ కూడా వచ్చేశాయి. తాజాగా ఇప్పుడు మూడో పాత్ర ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. వినాయక చవితి కానుకగా, యంగ్ టైగర్ అభిమానుల కోసం జై లవకుశ సినిమా నుంచి కుశ పాత్ర లుక్ ను విడుదల చేశారు.

జై లుక్ చూసి ఆడియన్స్ ఎంత షాకయ్యారో.. కుశ లుక్ కూడా అంతే షాకిచ్చింది. అవును.. లాంగ్ హెయిర్ స్టయిల్ తో, ట్రిమ్ చేసి గడ్డంతో ఎన్టీఆర్ అల్ట్రా మాడ్రన్ లుక్ లో కనిపిస్తున్నాడు. పైగా అతడి ఫస్ట్ లుక్ పోస్టర్ లో కరెన్సీ నోట్ల మధ్య కుశ క్యారెక్టర్ ను చూపించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచే, వచ్చేనెల 21న దసరా కనుకగా జై లవకుశ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరనస నివేత థామస్, రాశి ఖన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు.