జై లవకుశ మొదటి రోజు వసూళ్లు

Published On: September 22, 2017   |   Posted By:
జై లవకుశ మొదటి రోజు వసూళ్లు
జై లవకుశ మొదటి రోజు వసూళ్లు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలైంది జై లవకుశ సినిమా. ప్రీమియర్స్ లో ఇప్పటికే రికార్డు సృష్టించిన ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్లలో కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా 21 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమా ఫస్ట్ డేలోనే 49 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టడం విశేషం. ఎన్టీఆర్ 3 డిఫరెంట్ గెటప్స్ వేయడం, జనతా గ్యారేజ్ లాంటి సక్సెస్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో.. జై లవకుశపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి.
ఏపీ, తెలంగాణ ఫస్ట్ డే వసూళ్లు (షేర్ లెక్కలు కోట్లలో..)
నైజాం – 5.05
సీడెడ్ – 3.77
ఉత్తరాంధ్ర – 1.89
ఈస్ట్ – 2.96
వెస్ట్ – 1.90
గుంటూరు – 3.05
కృష్ణా – 1.70
నెల్లూరు – 1.08
మొత్తం షేర్ –  21.4 కోట్లు