జై లవకుశ షూటింగ్ అప్ డేట్స్

Published On: August 17, 2017   |   Posted By:

జై లవకుశ షూటింగ్ అప్ డేట్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ పై చాలామందికి చాలా అనుమానాలు ఉండేవి. కొన్ని సైట్స్ లో సినిమా పోస్ట్ పోన్ అంటూ కథనాలు కూడా వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చిన యూనిట్ తాజాగా షెడ్యూల్ వివరాల్ని బయటపెట్టింది. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతానికి 2 సాంగ్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆ రెండు పాటల్ని కుదిరితే ఈనెలాఖరుకే కంప్లీట్ చేయాలని భావిస్తోంది యూనిట్.

సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కూడా ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి డబ్బింగ్ కూడా షురూ అయింది. సో.. అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని, సెప్టెంబర్ 21న సినిమా థియేటర్లలోకి వస్తుందని అంటోంది యూనిట్. ఎన్టీఆర్ ఇందులో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు

మరోవైపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా కంప్లీట్ అయింది. తారక్ ఇంతకుముందు నటించిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, జై లవకుశ కు డిమాండ్ పెరిగింది. చాలా ఏరియాస్ లో ఈ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్లు వచ్చాయి. మరో 10 రోజుల్లో అగ్రిమెంట్స్ పూర్తయిన తర్వాత.. ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ బయటకొస్తాయి.