`జై లవకుశ` సినిమా కాదు… గొప్ప అనుభూతి – ఎన్టీఆర్‌ 

Published On: September 4, 2017   |   Posted By:

`జై లవకుశ` సినిమా కాదు… గొప్ప అనుభూతి – ఎన్టీఆర్‌ 

‘జనతాగ్యారేజ్‌’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు, చిన్నపాటి కన్‌ఫ్యూజన్‌కు గురైయ్యాను. మనసుకు నచ్చిన కథతో సినిమా చేయాలా, ట్రెండ్‌ ఫాలో కావాలా అని ఆలోచన ఉండేది. అయితే బాబిగారు కథ చెప్పగానే, మనసుకు నచ్చిన కథతోనే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను. నా మనసుకు నచ్చిన కథ జైలవకుశ అని అన్నారు ఎన్టీఆర్‌.

ఆయన కథనాయకుడుగా నటించిన సినిమా ‘జై లవకుశ’. కె.ఎస్‌.రవీంద్ర దర్శకుడు. నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మాత. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సీడీని ఎన్టీఆర్‌ ఆవిష్కరించి నందమూరి హరికృష్ణకు అందించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ..” ‘జై లవకుశ’ నాకు కేవలం సినిమాయే కాదు. గొప్ప అనుభూతి. ఎందుకంటే ఇలాంటి అవకాశాన్ని ఓ నటుడుకి భగవంతుడు, అరుదుగా ఇస్తుంటాడు. ఇది కేవలం చిత్రంగానే కాదు, నేను, అన్నయ్య కల్యాణ్‌ తో పాటు మా పెద్దన్నయ్య కీర్తిశేషులు జానకిరాంగారు ఉండుంటే జై లవకుశ అనే టైటిల్‌కు సార్ధకత వచ్చేది. ఈ సినిమా నేను, కల్యాణ్‌ అన్నయ్య నాన్నకు ఇస్తున్న షష్టి పూర్తి కానుక. అమ్మ, నాన్నలను గర్వంగా ఫీలయ్యేలా చేసే సినిమా ఇది. అన్నదమ్ముల ఔనత్యాన్ని పెంపొందించే చిత్రం దొరకడం అద ష్టంగా ఉంది. దేవిశ్రీకి నాకు మధ్య అనుబంధానికి మాటలు అవసరం లేదు. పాటలే నిదర్శనం” అన్నారు. నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ..”జై లవకుశ పేరు చూడగానే ఆనాడు మా తండ్రిగారు, స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు నటించిన ఆనాటి లవకుశ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే చరిత్ర స ష్టించిన సినిమా అది. రాముడంటే ఇలా ఉంటాడని ప్రజలకు ఎలుగెత్తి చెప్పిన సినిమా. అలాగే ఈ సినిమా కూడా ప్రజల మన్నలు పొందాలని కోరుకుంటున్నాను. ఆనాడు రామకృష్ణా స్టూడియోస్‌లో నేను ప్రొడ్యూసర్‌ అయితే బాలయ్య ఆర్టిస్ట్‌. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా ఎన్టీఆర్‌ యాక్ట్‌ చేస్తే, కల్యాణ్‌ బాబు నిర్మించారు. డైరెక్టర్‌ బాబిగారికి అభినందనలు” అన్నారు.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ..”మా నందమూరి కుటుంబంలో ఓ ప్రొడక్షన్‌ హౌస్‌. అందులో ఓ నందమూరి హీరో యాక్ట్‌ చేసి చాలా సంత్సరాలైంది. దేవిశ్రీ ప్రసాద్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. సిచ్చువేషనల్‌ సాంగ్స్‌. అన్ని సన్నివేశాలకు తగినట్లు డిఫరెంట్‌గా ఉంది. సినిమాను సెప్టెంబర్‌ 21న విడుదల చేస్తున్నాం” అన్నారు.

కె.ఎస్‌.రవీంద్ర మాట్లాడుతూ..” ఎన్టీఆర్‌గారితో మూడు వేరియేషన్స్‌ ఉన్న సినిమాను డైరెక్ట్‌ చేసే అవకాశం నాకు వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎన్టీఆర్‌గారి పెర్‌ఫార్మెన్స్‌కు నేను సాక్షిని. ప్రతిరోజూ నేను ఎంజాయ్‌ చేశాను. మూడు లేయర్స్‌ను హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. మంచి టీం దొరికింది. గ్యాప్‌ లేకుండా సినిమాను పూర్తి చేశాం” అన్నారు.