జై లవకుశ సెన్సార్ రిపోర్ట్

Published On: September 13, 2017   |   Posted By:

జై లవకుశ సెన్సార్ రిపోర్ట్

జై లవకుశ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ పూర్తవ్వడంతో జై లవకుశ విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో డేట్ లైన్ తో పోస్టర్లు విడుదల చేశారు మేకర్స్. ఈ నెల 21న వస్తున్నామంటూ అఫీషియల్ గా ప్రకటించారు.

సెన్సార్ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. జై లవకుశ ఫస్టాఫ్ చాలా బాగుందని, సెకెండాఫ్ ఎబోవ్ యావరేజ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు సెకెండాఫ్ చాలా పెద్దదిగా ఉన్న ఫీలింగ్ కూడా కలిగిందని అంటున్నారు కొందరు సెన్సార్ సభ్యులు. ఈ సినిమా నిడివి 155 నిమిషాలుంది. నిజానికి ఇది ఏమంత పెద్ద నిడివి కాదు. కానీ సెకండాఫ్ మాత్రం చాలా పెద్దదిగా ఉన్న ఫీలింగ్ కలుగుతుందట. మొత్తమ్మీద ఓవరాల్ గా జై లవకుశ సినిమా బాగుందని అంటున్నారు సెన్సార్ సభ్యులు.

ఎన్టీఆర్ ఇందులో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఇందులో జై పాత్ర నెగెటివ్ షేడ్స్ లో ఉంటుంది. ఆ క్యారెక్టరే సినిమాకు హైలెట్ అంటున్నారు.