జై సింహా మూవీ రివ్యూ

Published On: January 12, 2018   |   Posted By:
జై సింహా మూవీ రివ్యూ
నిర్మాణ సంస్థ :  సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
తారాగ‌ణం :  బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార‌, , ప్ర‌కాష్ రాజ్‌, న‌టాషా దోషి, హ‌రిప్రియ‌ బ్ర‌హ్మానందం, ముర‌ళీమోహ‌న్‌, అశుతోష్ రాణా, ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు
మాట‌లు : ఎం.ర‌త్నం
క‌ళ :  నారాయ‌ణ‌రెడ్డి
సంగీతం :  చిరంత‌న్ భ‌ట్‌
చాయాగ్ర‌హ‌ణం :  రాంప్ర‌సాద్‌
నిర్మాత :  సి.క‌ల్యాణ్‌
ద‌ర్శ‌క‌త్వం :  కె.ఎస్‌.ర‌వికుమార్‌
రన్ టైం – 165  నిమిషాలు
సెన్సార్ – ‘U/A” సర్టిఫికేట్
ఇప్పుడున్న సీనియ‌ర్ హీరోల్లో కృష్ణ త‌ర్వాత సంక్రాంతి హీరోగా పేరు సంపాదించుకున్న‌ది నంద‌మూరి బాల‌కృష్ణ. సంక్రాంతికి విడుద‌లైన బాల‌కృష్ణ సినిమాలు మంచి విజయాల‌నే సాధించాయి. ఇక రీసెంట్ టైమ్‌లో చూస్తే గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, డిక్టేట‌ర్ సినిమాల‌తో వ‌రుసగా త‌న సినిమాల‌ను సంక్రాంతి పండుగ‌ల‌కే విడుద‌ల చేసిన బాల‌య్య‌..ఈ ఏడాది సంక్రాంతికి`జై సింహా`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాలో సెంటిమెంట్ ప‌రంగా కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకున్నారు. బాల‌కృష్ణ‌కు అచ్చొచ్చిన టైటిల్లో సింహా అనే ప‌దం ఉండేలా చూసుకున్నారు. బాల‌కృష్ణ‌తో శ్రీరామ‌రాజ్యం, సింహా వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి మెప్పించిన న‌యన‌తార ఇందులో హీరోయిన్‌గా న‌టించింది. ఇన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ న‌డుమ విడుద‌లైన జై సింహా ప్రేక్ష‌కుల‌ను ఎంత మేర ఆక‌ట్టుకుందో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి ఓ లుక్కేద్దాం…
క‌థ:
న‌రసింహం(బాల‌కృష్ణ‌) త‌న బిడ్డ‌ను తీసుకుని క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల‌కు వెళ‌తాడు. అక్క‌డ నుండి త‌మిళ‌నాడులోని కుంభ‌కోణం చేరుకుంటాడు. అక్క‌డ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌(ముర‌ళీమోహ‌న్‌)తో ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆ ధ‌ర్మక‌ర్త ఇంట్లోని ప‌నికి కుదురుతాడు న‌రసింహం. త‌న కొడుకుని ప్లే స్లూల్‌లో జాయిన్ చేయాల‌నుకుని స్కూల్‌కు వెళ్లిన న‌రసింహం అక్క‌డ గౌరి(న‌య‌న‌తార), ఆమె తండ్రి(ప్ర‌కాష్ రాజ్‌)ని చూసి వారికి క‌న‌ప‌డ‌కుండా వ‌చ్చేస్తాడు. అదే స‌మయంలో కుంభ‌కోణంకు ఓ కొత్త ఎ.ఎస్‌.పి వ‌స్తాడు. ఆయ‌న చేసిన చిన్న త‌ప్పు కార‌ణంగా న‌రసింహం ఊరి ముందు నిల‌దీసి క్ష‌మాప‌ణ‌లు చెప్పిస్తాడు. దాంతో ఆ ఎ.ఎస్‌.పికి న‌రసింహంపై క‌క్ష పెంచుకుంటాడు. అదే స‌మ‌యంలో ధ‌ర్మ‌క‌ర్త కుమార్తె(న‌టాషా దోషి)..కుంభ‌కోణంలో పేరు మోసిన రౌడీ క‌న్నియ‌ప్ప‌న్(ప్ర‌భాక‌ర్‌) త‌మ్ముడినికి కారుతో గుద్దేస్తుంది. ఆమెకు ఏమీ కాకూడ‌ద‌నే కార‌ణంతో న‌ర‌సింహం ఆ యాక్సిడెంట్‌ను త‌నే చేసిన‌ట్లు త‌న‌పై అభాండం వేసుకుంటాడు. న‌ర‌సింహంపై క‌క్ష క‌ట్టిన ఎ.ఎస్‌.పి, క‌న్నియ‌ప్ప‌న్ త‌మ్ముడిని చంసేసి..ఆ హ‌త్య‌ను న‌ర‌సింహంపైకి నెట్టేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అదే స‌మ‌యంలో క‌న్నియ‌ప్ప‌న్ మ‌నుషులు న‌ర‌సింహం కొడుకుని కిడ్నాప్ చేస్తారు. త‌న కొడుకుని న‌రసింహం క‌న్నియ‌ప్ప‌న్ బారి నుండి కాపాడుకుంటాడు. కానీ ఆ కొడుకు త‌న కొడుకు కాద‌ని, ఎస్‌.పి. కొడుకు అనే నిజం తెలుసుకుని ఆశ్చ‌ర్చ‌పోతాడు. అస‌లు ఎస్‌.పికి, న‌ర‌సింహం ఉన్న రిలేష‌న్ ఏంటి?  గౌరి ఎవ‌రు? న‌రసింహంకు వైజాగ్‌తో ఉన్న అనుబంధం ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్ల‌స్ పాయింట్స్ :
– బాల‌కృష్ణ  న‌ట‌న యాక్ష‌న్‌, డాన్సులు
– సినిమాటోగ్ర‌ఫీ
– ఫ‌స్టాఫ్‌
– సెకండాఫ్‌లో కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు
–  నిర్మాణ విలువ‌లు
బ‌లహీన‌త‌లు :
– సెకండాఫ్
– సంగీతం, నేప‌థ్య సంగీతం
– కొన్ని స‌న్నివేశాలు ఇత‌ర సినిమాల్లోని స‌న్నివేశాలను గుర్తుకు తేవ‌డం
విశ్లేష‌ణ‌
సంక్రాంతి హీరోగా ఈ ఏడాది `జైసింహా`తో ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చిన నంద‌మూరి బాల‌కృష్ణ. వ‌య‌సు పెరుగుత‌న్నా..త‌న ఎన‌ర్జి ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ప్రూవ్ చేశాడు. అద్భుతంగా డాన్సులు, ఫైట్స్‌తో అల‌రించాడు.
ముఖ్యంగా జానీ మాస్టర్ కంపోజ్ చేసిన అమ్మ‌కుట్టి సాంగ్‌లో స్టెప్స్‌ను కుర్ర హీరోల‌కు ధీటుగా వేయ‌డం విశేషం.
ఇక రామ్ లక్ష్మ‌ణ్ కంపోజ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను అంతే రేంజ్‌లో చేసి మెప్పించాడు.
ఇక దర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ బాల‌య్య ఇమేజ్‌కు త‌గ్గ క‌థ‌, ఎమోష‌న్స్‌, సెంటిమెంట్ ఉన్న క‌థ‌తో తెర‌పై త‌న‌దైన రీతిలో జైసింహాను అబిమానులు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా తెర‌కెక్కించాడు.
క‌థ క‌న్విన్సింగ్‌గా ఉంది. ముగ్గురు హీరోయిన్ల‌ను కేవ‌లం గ్లామ‌ర్ కోసం వాడుకోలేదు ద‌ర్శ‌కుడు. ప్ర‌తి ఒక్క‌రి పాత్ర‌నూ క‌థ‌లో చాలా చ‌క్క‌గా చొప్పించారు ఎం.ర‌త్నం. ఆయ‌న క‌థ‌, మాట‌లు మెప్పించాయి.
అయితే `చంద్ర‌ముఖి`లో వ‌డివేలుకు ఉన్న అనుమానాన్ని ఇక్క‌డ బ్ర‌హ్మానందానికి పెట్టారు. `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` చిత్రంలో అంజ‌లికి ఉన్న కంగారును ఇందులో హ‌రిప్రియ పాత్ర‌కు పెట్టారు. ప్రేమించింది ఒక‌రిని, పెళ్లి చేసుకుంది మ‌రొక‌రిని అన్న‌ప్పుడు `క్ష‌త్రియ‌పుత్రుడు`తో స‌హా ప‌లు సినిమాలు గుర్తొస్తాయి.
అయితే అవ‌న్నీ సినిమా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎలా ఉంద‌ని ఆలోచించ‌డం మొద‌లుపెట్టిన త‌ర్వాతే. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కుడు లీన‌మ‌వుతాడ‌న్న‌ది నిజం.
రోడ్డు రోకోల‌ను గురించి చెప్పే స‌న్నివేశం, పూజారుల అర్హ‌త‌ల‌ను, వారి ప‌విత్ర‌త‌ను వివ‌రించే సీనూ మెప్పిస్తాయి.
ఇక చిరంత‌న్ భ‌ట్ సంగీతం, నేప‌థ్య సంగీతం పెద్ద‌గా ఆకట్టుకోలేదు.
అయితే రాంప్ర‌సాద్‌సినిమాటోగ్ర‌ఫీ అద్భుతంగా ఉంది. ప్ర‌తి సీన్‌ను ఎంతో చ‌క్క‌గా చూపించాడు.
నిర్మాణ విలువ‌లు బావున్నాయి.
బాట‌మ్ లైన్ :  డాన్సులు, యాక్ష‌న్‌, ఎమోష‌న్స్‌, సెంటిమెంట్‌తో ఆక‌ట్టుకునే `జైసింహా`
రేటింగ్ : 3/5