జై సింహా లాభం రూ. 12 కోట్లు

Published On: February 14, 2018   |   Posted By:

జై సింహా లాభం రూ. 12 కోట్లు

బాలయ్య నటించిన జైసింహా సినిమా సంక్రాంతి బరిలో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను అటుఇటుగా 39-40 కోట్ల రూపాయల మధ్యలో అమ్మారు. డిస్ట్రిబ్యూషన్ షేర్ పోను నిర్మాతకు 5 కోట్లు మిగిలింది. వీటితో పాటు మిగతా రాబటి మొత్తం కలుపుకుంటే జై సింహాకు 12 కోట్ల రూపాయల లాభం వచ్చింది.

థియేట్రికల్ లాభం – రూ. 5 కోట్లు
ఓవర్సీస్ లాభం – 50 లక్షలు (నిర్మాత సొంత రిలీజ్)
శాటిలైట్ రైట్స్ – రూ. 5 కోట్లు (డిజిటల్ రైట్స్ తో కలుపుకొని)
ఆడియో రైట్స్ – రూ. 70 లక్షలు
హిందీ డబ్బింగ్ రైట్స్ – కోటి రూపాయలు

మొత్తం లాభం – రూ. 12 కోట్ల 20 లక్షలు