జై సింహా సీడెడ్ బిజినెస్

Published On: December 19, 2017   |   Posted By:
జై సింహా సీడెడ్ బిజినెస్
సీడెడ్ లో బాలయ్య మార్కెట్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఈ నందమూరి హీరో ఓ సినిమా చేస్తున్నాడంటే సీడెడ్ లో అది రికార్డు ధరకు పోవాల్సిందే. జై సింహా సీడెడ్ రేటు కూడా దీనికి మినహాయింపు కాదు. కేఎస్ రవికుమార్ డైరక్షన్ లో సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సీడెడ్ లో సీడెడ్ లో 4 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయింది. అది కూడా ఎన్ఆర్ఏ బేసిస్ కింద వెళ్లింది. ఈ మేరకు నిర్మాతలు 5 కోట్లు అడ్వాన్స్ అందుకున్నారు. సో.. జై సింహాకు నైజాంలో ఓవర్ ఫ్లోస్ వచ్చే అవకాశాలున్నాయని బయ్యర్లు ముందుగానే ఊహించారన్నమాట.
నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ హీరోహీరోయిన్లుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “జై సింహా” షూటింగ్ పూర్తయింది. జనవరి 12న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా ఆడియోను ఈనెల 24న విడుదల చేయబోతున్నారు. విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లో గ్రాండ్ గా జై సింహా ఆడియో రిలీజ్ వేడుక ఉంటుంది.
రీసెంట్ గా సినిమాకు సంబంధించి దుబాయ్ లో ఓ షెడ్యూల్ చేశారు. 2 పాటలు పిక్చరైజ్ చేశారు. ఆ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది. కేఎస్ రవికుమార్ డైరక్ట చేస్తున్న ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.