జై సింహా 5 రోజుల వసూళ్లు

Published On: January 17, 2018   |   Posted By:

జై సింహా 5 రోజుల వసూళ్లు

సంక్రాంతి కానుకగా విడుదలైన జై సింహా సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది. బాలయ్య, నయనతార కాంబినేషన్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్నటితో 5 రోజులు పూర్తిచేసుకుంది. ఈ 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో జై సింహా సినిమాకు 17.87 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ వసూళ్లలో ఈ సినిమా 20 కోట్ల మార్క్ క్రాస్ చేసింది.

ఏపీ, నైజాం 5 రోజుల వసూళ్లు

నైజాం – రూ. 3.63 కోట్లు
సీడెడ్ – రూ. 4.47 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.16 కోట్లు
గుంటూరు – రూ. 2.07 కోట్లు
ఈస్ట్ – రూ. 1.76 కోట్లు
వెస్ట్ – రూ. 1.52 కోట్లు
కృష్ణా – రూ. 1.28 కోట్లు
నెల్లూరు – రూ. 0.98 కోట్లు

మొత్తం 5 రోజుల వసూళ్లు – రూ. 17.87 కోట్లు