టచ్ చేసి చూడు క్లోజింగ్ కలెక్షన్లు

Published On: February 21, 2018   |   Posted By:

టచ్ చేసి చూడు క్లోజింగ్ కలెక్షన్లు

రవితేజ, రాశిఖన్నా, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన టచ్ చేసి చూడు సినిమా థియేటర్లలో తన ఫైనల్ రన్ పూర్తిచేసుకుంది. ఏపీ, నైజాంలోని మార్కెట్ ఏరియాస్ లో ఈ సినిమా ఆడట్లేదు. టోటల్ రన్ లో టచ్ చేసి చూడు సినిమా 8 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు అటుఇటుగా 10 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఈ సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయమయ్యాడు.

ఏపీ, నైజాం ఫైనల్ కలెక్షన్లు
నైజాం – రూ. 3.14 కోట్లు
సీడెడ్ – రూ. 1.20 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.90 కోట్లు
గుంటూరు – రూ. 0.74 కోట్లు
ఈస్ట్ – రూ. 0.75 కోట్లు
వెస్ట్ – రూ. 0.66 కోట్లు
కృష్ణా – రూ. 0.59 కోట్లు
నెల్లూరు – రూ. 0.35 కోట్లు

టోటల్ క్లోజింగ్ షేర్ – రూ. 8.33 కోట్లు