టచ్ చేసి చూడు ట్రయిలర్ రివ్యూ

Published On: January 27, 2018   |   Posted By:

టచ్ చేసి చూడు ట్రయిలర్ రివ్యూ

రవితేజ కొత్త సినిమా టచ్ చేసి చూడు. రాజా ది గ్రేట్ సక్సెస్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన ఈ హీరో, టచ్ చేసి చూడుతో మరోసారి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగా కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేశాడు.
ట్రయిలర్ చూస్తుంటే మాస్ మహారాజ్ స్టయిల్ లో కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమా తెరకెక్కిందనే విషయం అర్థమౌతోంది. రవితేజ మాస్ అప్పీల్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ను కూడా ఇందులో చూపించారు. స్టోరీ ఏంటనే విషయాన్ని రివీల్ చేయనప్పటికీ.. పోలీస్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ తో సినిమా తెరకెక్కిందనే విషయం అర్థమౌతోంది.
హీరోయిన్లు రాశి ఖన్నా, సీరత్ కపూర్ ను ట్రయిలర్ లో అందంగా చూపించారు. మరీ ముఖ్యంగా ఇద్దరితో గ్లామర్ షో అద్భుతంగా పండే అవకాశముందని ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ కు విక్రమ్ సిరికొండ డైలాగులు, ఛోటా కె నాయకుడు సినిమాటోగ్రఫీ, జామ్-8 గ్రూప్ మ్యూజిక్ పెర్ ఫెక్ట్ గా సింక్ అయింది. వచ్చేనెల 2న థియేటర్లలోకి రానుంది టచ్ చేసి చూడు సినిమా.