టాక్సీవాలా టీజర్ రిలీజ్ వాయిదా

Published On: April 16, 2018   |   Posted By:
టాక్సీవాలా టీజర్ రిలీజ్ వాయిదా
విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ టాక్సీవాలా. గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మోషన్ పోస్టర్ విడుదల చేశారు. స్టిల్స్ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. అదే ఊపులో టీజర్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడా తేదీని వాయిదా వేశారు.
లెక్కప్రకారం, టాక్సీవాలా టీజర్ ను రేపు రిలీజ్ చేయాలి. ఇంకా చెప్పాలంటే రేపు ఉదయం 11గంటల 30నిమిషాలకు టీజర్ విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడా కార్యక్రమాన్ని ఎల్లుండి (ఏప్రిల్ 18)కి వాయిదా వేశారు. ఎన్ని గంటలకు అనే విషయాన్ని రేపు ప్రకటిస్తారు. ఇలా ఒక రోజు ఆలస్యంగా టీజర్ ఎందుకు విడుదలచేస్తున్నారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమాను మే 18న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.