టాక్సీవాలా మూవీ టీజర్ రివ్యూ

Published On: April 19, 2018   |   Posted By:

టాక్సీవాలా మూవీ టీజర్ రివ్యూ


అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా వచ్చింది. కానీ అది ఐదేళ్ల కిందటి సినిమా. దాన్ని ఎవరూ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్వయంగా విజయ్ దేవరకొండనే ప్రకటించాడు. సో.. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నుంచి అఫీషియల్ గా రాబోతున్న సినిమా టాక్సీవాలా మాత్రమే. ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ

టాక్సీవాలా టీజర్ చూసి ఇది ఏ జానర్ కు చెందిన సినిమా అనేది చెప్పడం చాలా కష్టం. హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, రొమాన్స్.. ఇలా అన్నీ ఉన్నాయి టీజర్ లో. పైగా సినిమా కథ ఏంటనే విషయాన్ని ఒక్క ఫ్రేమ్ లో కూడా రివీల్ చేయకపోవడం విశేషం. కాకపోతే, సినిమా కథ మాత్రం ఓ ట్యాక్సీ చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని అంతర్లీనంగా చెప్పారు.

టీజర్ లో తన లుక్స్ తో విజయ్ దేవరకొండ అదరగొట్టగా.. జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుజిత్ సినిమాటోగ్రఫీ సినిమాకు హాలీవుడ్ లుక్ తీసుకొచ్చింది. రాహుల్ డైరక్ట్ చేసిన ఈ సినిమా సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది.