టాలీవుడ్ కి మరో న్యూ విలన్ … మన తెలుగు వాడే

Published On: July 25, 2017   |   Posted By:

టాలీవుడ్ కి మరో న్యూ విలన్ … మన తెలుగు వాడే

సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఎలాంటి బ్యాక్-గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం చాలా కష్టం. అలా వచ్చి..తమ ట్యాలెంట్ నిరూపించుకొని టాలివుడ్ లో టాప్ పోసిషన్ లో ఉన్నారు. ఈ హోప్స్ తోనే వచ్చిన తేజ గోవింద్ కూడా టాలివుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రేమమ్ సినిమా నాగచైతన్య కెరీర్ కి మంచి హిట్ ఇచ్చింది…అదే సినిమాతో తెరంగేట్రం చేసాడు తేజ గోవింద్. ఈ సినిమా తేజాకు చిన్న రోల్ ఇచ్చినా అందులో ఒదిగిపోయాడు తేజ.

అయితే..ఈమధ్య కాలంలో హీరోలతో పాటు  విలన్లకు కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు తేజ కూడా ‘విలన్’ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బోయపాటి శ్రీను, బెల్లకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘జయ జానకి నాయకి’ సినిమాలో తేజ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సరైనోడు లో ఆది పినిశెట్టి విలన్ రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో..ఈ సినిమాలో తేజ క్యారెక్టర్ కూడా అంత కీలకంగా ఉంటుంది.

Source:-Press – note