టాలీవుడ్ లో ఈరోజు

Published On: September 29, 2017   |   Posted By:

టాలీవుడ్ లో ఈరోజు

చరిత్ర చూస్తే టాలీవుడ్ లో ప్రతి రోజుకు ఓ ప్రత్యేక సందర్భం కనిపిస్తుంది. కొందరు ప్రముఖులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. టాలీవుడ్ హిస్టరీని మలుపుతిప్పే సినిమాలు కొన్ని రిలీజ్ అవుతుంటాయి. అలా ఈరోజుకు (29-09-2017) కూడా ఓ ప్రత్యేకత ఉంది. అవును… ప్రభాస్ కెరీర్ ను మలుపుతిప్పిన ఛత్రపతి విడుదలైంది ఈ రోజే.

పుష్కరం కిందట సరిగ్గా ఇదే రోజున టాలీవుడ్ లో చరిత్ర ప్రారంభమైంది. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా 2005 సెప్టెంబర్ 29న విడుదలై సరికొత్త చరిత్రకు పునాది వేసింది. వర్షం సినిమాతో అప్పటికే ఓ బ్లాక్ బస్టర్ ఖాతాలో ఉన్నప్పటికీ వెంటవెంటనే రెండు ఫ్లాపులొచ్చాయి. సరిగ్గా అదే టైమ్ లో వచ్చిన ఛత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లింది. ఇంకా చెప్పాలంటే బాహుబలి సినిమా వచ్చినంతవరకు ప్రభాస్ కెరీర్ లో దిబెస్ట్ మూవీ ఛత్రపతి మాత్రమే.

54 సెంటర్లలో దిగ్విజయంగా వంద రోజులు ఆడిన ఛత్రపతి సినిమా 2 నంది అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ గా కీరవాణికి, ఉత్తమ సహాయనటిగా భానుప్రియకు నంది అవార్డులు తెచ్చిపెట్టింది ఛత్రపతి. బాహుబలి-2తో బ్రహ్మాండమైన హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు 12 ఏళ్ల ఛత్రపతి సెలబ్రేషన్స్ ను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.