టాలీవుడ్ స్టుడియో రౌండప్ 

Published On: September 18, 2017   |   Posted By:

టాలీవుడ్ స్టుడియో రౌండప్ 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో  రవితేజ చేస్తున్న మూవీ రాజా ది గ్రేట్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు కాబట్టి.. వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిన్నటివరకు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. త్వరలోనే రాయ్ గఢ్ లో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ తర్వాత తిరిగి హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది.

అఖిల్ చేస్తున్న సెకండ్ మూవీ హలో. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 70శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో కల్యాణి హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఢిల్లీలో ప్లాన్ చేశారు. ఏఎన్నార్ జాతీయ అవార్డు పురస్కారం ఫంక్షన్ కు హాజరైన అఖిల్.. రేపట్నుంచి ఢిల్లీలో జరిగే షెడ్యూల్ లో పాల్గొంటాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా కూడా ఓ కొలిక్కి వస్తోంది. అక్టోబర్ చివరినాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా తాజాగా బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేశారు. నిన్ననే యూనిట్ తో కలిసి హైదరాబాద్ తిరిగొచ్చిన పవన్.. ఎల్లుండి (సెప్టెంబర్ 20) నుంచి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభించబోతున్నాడు.

ఓ వైపు స్పైడర్ ప్రచార వ్యవహారాల్ని పర్యవేక్షిస్తూనే, మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాకు “భరత్ అనే నేను”అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోలో జరుగుతోంది. స్టుడియోలో వేసిన అసెంబ్లీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది.