టి.యన్.ఆర్ జ్య్నాపకార్థం అన్నదాన కార్యక్రమం

Published On: August 4, 2021   |   Posted By:

టి.యన్.ఆర్ జ్య్నాపకార్థం అన్నదాన కార్యక్రమం


ప్రముఖ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్,నటుడు టి.యన్.ఆర్ ఈ మధ్యనే కోవిడ్ కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా ,ఆయన సహాయ గుణం,సేవా భావం,ఇంటర్వ్యూల ద్వారా అందరి మధ్య చిరస్థాయిగా నిలిచి ఉంటారని ప్రముఖ డాక్టర్, డైరెక్టర్,సామాజిక కార్యకర్త డా.ఆనంద్ తెలిపారు.  

 

టి.యన్.ఆర్ కుటుంబ సభ్యుల సహకారంతో,ఆయన పిల్లల చేతుల మీదుగా,బంజారా మహిళా యన్ జీ వో ఆధ్వర్యంలో హైదరాబాదు లోని బాచుపల్లి ప్రాంతంలో ఉన్న నెస్ట్ వృద్ధాశ్రమంలో దాదాపు వంద మందికి అన్నదాన  కార్యక్రమాన్ని, టి.యన్.ఆర్ జ్ఞ్యాపకార్థం నిర్వహించారు.

ఈ సందర్భంగా టి.యన్.ఆర్ కు నివాళులు అర్పించి,ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ ప్రార్థించారు.