టొరంటో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కార్తి ఖైదీ

Published On: August 1, 2020   |   Posted By:

టొరంటో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కార్తి ఖైదీ

టొరంటో లో జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి కార్తి బ్లాక్ బస్టర్ ‘ఖైదీ’

యాంగ్రీ హీరో కార్తి హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించగా, తెలుగులో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె కె రాధామోహన్ విడుదల చేసిన ఖైది బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా వినూత్న పంథా లో తెరకెక్కిన కొత్త తరహా చిత్రంగా ప్రేక్షకుల విశేష మన్ననలు పొందింది.

ఇప్పుడు ‘ఖైది’ కి మరో విశేష గౌరవం దక్కింది. టొరంటో లో ఆగస్ట్ 9 నుండి 15 వరకు జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆగస్ట్ 12న ‘ఖైదీ’ ను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు కె కె రాధామోహన్, ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. చిత్రం కోసం పనిచేసిన టీం అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.