ట్రెడిష‌న‌ల్ పూజాహెగ్డే

Published On: February 13, 2018   |   Posted By:

ట్రెడిష‌న‌ల్ పూజాహెగ్
ప్ర‌స్తుతం ముంబ‌యి సొగ‌స‌రి పూజా హెగ్డే బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న న‌టిస్తుంది. శ్రీవాస్ ద‌ర్శ‌త‌క్వంలో రూపొందుతున్న `సాక్ష్యం` సినిమా వేస‌విలో విడుద‌ల కానుంది. ఈ సినిమా పూజా హెగ్డే.. ట్రెడిష‌న‌ల్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌ట‌. ఇంత ట్రెడిష‌న‌ల్ లుక్ ఏ సినిమాలో చేయ‌లేద‌ని అంటుంది పూజా హెగ్డే. అలాగే  ఈ ఏడాది ముగ్గురు స్టార్ హీరోస్ స‌ర‌స‌న న‌టింనుంది పూజా హెగ్డే.  సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించ‌నుంది. అలాగే ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ సినిమాలో కూడా పూజా హెగ్డే న‌టించ‌నుంది. అలాగే `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా చేయ‌బోయే సినిమా కోసం పూజా హెగ్డేతో యూనిట్ వ‌ర్గాలు సంప్ర‌దింపులు చేస్తున్నారు.