డాన్స్ రాజా డాన్స్ చిత్రం పాట విడుదల

Published On: February 26, 2021   |   Posted By:

డాన్స్ రాజా డాన్స్ చిత్రం పాట విడుదల

డాన్స్ రాజా డాన్స్” చిత్రం నుంచి”దూకేస్తా దూకేస్తా సింహంలా దూకేస్తా”
పాట విడుదల చేసిన పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు

డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా సోదరుడు నాగేంద్ర ప్రసాద్, భాగ్యరాజ, రాజ్ కుమార్, శ్రీజిత్ ఘోష్, రాంకీ (నిరోష), మనోబాల, ఊర్వశి, జూనియర్ బాలయ్య ముఖ్య తారాగణంగా… వెంకీ  దర్శకత్వంలో రూపొంది డాన్సులతో ఉర్రూతలూగించిన ఓ చిత్రం “డాన్స్ రాజా డాన్స్”గా  ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.   

ఈ చిత్రంలో.. “దూకేస్తా… దూకేస్తా సింహలా దూకేస్తా” అనే పల్లవితో సాగే హుషారైన మాస్ మసాలా గీతాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త-నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు ఆవిష్కరించారు. “డాన్స్ రాజా డాన్స్” తెలుగులోనూ ఘన విజయం సాధించాలని ఆయన అభిలషించారు. భారతీబాబు పాటలు అందించిన ఈ చిత్రంలోని నాలుగు పాటలకూ… రాజు-సుధీర్-మూర్తిలతో కలిసి ప్రముఖ సంగీత దర్శకురాలు-గాయని ఎమ్.ఎమ్.శ్రీలేఖ గాత్రం అందించడం విశేషం.   

ఎదిగే కొద్దీ అందరికీ అందుబాటులో ఉండే గొప్ప వ్యక్తి రఘురామకృష్ణంరాజు గారి చేతుల మీదుగా ‘డాన్స్ రాజా డాన్స్’ పాట రిలీజ్ కావడం ఆనందంగా ఉందన్నారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు సంధ్య రవి, ప్రొడక్షన్ డిజైనర్ చందు ఆది పాల్గొన్నారు