డైరెకక్ట‌ర్‌గా చైతు

Published On: August 14, 2017   |   Posted By:

డైరెకక్ట‌ర్‌గా చైతు

అక్కినేని నాగ‌చైత‌న్య డైరెక్ట‌ర్‌గా మారుతున్నాడా..అదేంటి హీరోగా ఇప్పుడే క‌దా పేరు తెచ్చుకుంటున్నాడు. త‌న‌కిప్పుడే డైరెక్ష‌న్ చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌ని అనుకుంటున్నారా..చైతు డైరెక్ట‌ర్‌గా సినిమాల‌ను కాదు యాడ్ ఫిలింస్ చేయ‌బోతున్నాడ‌ట‌. అది కూడా రియ‌ల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లోఅని అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

చైతు హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య యాడ్ ఫిలిం డైరెక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. గ‌తంలో చైతు, చందు మొండేటి కాంబినేష‌న్‌లో ప్రేమ‌మ్ సినిమా మంచి స‌క్సెస్‌ను సాధించింది. ఇప్పుడు మ‌ళ్లీ ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతుంది. త్వ‌ర‌లోనే సినిమా స్టార్ట్ కానుంది.