డ్రైవర్ రాముడు టీజర్ రివ్యూ

Published On: May 23, 2018   |   Posted By:

డ్రైవర్ రాముడు టీజర్ రివ్యూ


కమెడియన్లు హీరోగా మారడం కొత్తకాదు. ఒకప్పటి హాస్యనటుడు చలం నుంచి మొదలుపెడితే అలీ వరకు చాలామంది ఉన్నారు. తర్వాత ఆ సంప్రదాయాన్ని సునీల్ లాంటి నటులు కొనసాగించారు. ఇప్పుడా కల్చర్ ను సప్తగిరి, షకలక శంకర్ లాంటి వాళ్లు భుజానికెత్తుకున్నారు. సప్తగిరి ఇప్పటికే హీరోగా 2 సినిమాలు చేశాడు. ఇప్పుడు షకలక శంకర్ వంతు.

నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరో గా  రాజ్ స‌త్య దర్శకత్వంలో  సినిమా పీపుల్ పతాకంపై వేణు గోపాల్ కొడుమగుళ్ల, ఎమ్ ఎల్ రాజు, ఆర్ ఎస్ కిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్రైవర్ రాముడు’. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మొదటి టీజర్ ను విడుదల చేసారు. హీరో సుధీర్ బాబు డ్రైవర్ రాముడు టీజర్ ను విడుదల చేసారు. టీజర్ లో మోస్ట్ ఎనర్జిటిక్ గా, కామిక్ పాత్రలో కనిపించాడు షకలక శంకర్. టైటిల్ కు తగ్గట్టే డ్రైవర్ పాత్రలో కనిపించిన షకలత శంకర్ ఏం చేశాడనేది ఈ సినిమా స్టోరీ.

ట్రావెలింగ్ కామెడీ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ప్రదీప్ రావత్, షకలక శంకర్ మధ్య కామెడీ సినిమాకు హైలెట్ గా ఉండబోతోందనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతోంది. అంచల్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు. అమర్ నాధ్ ఛాయాగ్రహకుడిగా వ్యవహరించాడు.