తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా ఒక వెబ్ సిరీస్

Published On: November 29, 2020   |   Posted By:
తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా ఒక వెబ్ సిరీస్ 
 
డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ పైననే ప్రేక్షకుల ఆసక్తి : డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ 
 
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై  తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా ఎందరో మహానుభావులు,బ్లాక్ బోర్డ్ వంటి  సినిమాలు చేసిన సంస్థ లో లాక్ డౌన్ తర్వాత తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం సొంత నిర్మాణ సంస్థలో ఒక సినిమా చేస్తున్న సమయంలో వేరొక బ్యానర్లో ఒక వెబ్ సిరీస్ ని మొదలు పెట్టారు. వినూత్న కథ వస్తున్నా ఈ వెబ్ సిరీస్ మొదటి షెడ్యూల్ పూర్తిచేస్తుంది. 
 
ఈ సందర్భంగా  దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ “మా టీం తో కలిసి ఈ లాక్ డౌన్  లో మంచి మంచి కథలు సిద్ధం చేసుకున్నాం. పంపిణీ దారుడు (  ఫిల్మ్ డిస్ర్టిబ్యూటర్ ) శంకర్ కొప్పిశెట్టి నిర్మాణం లో ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసాము. మొదటి షెడ్యూల్ పూర్తీ చేసుకుంది. రాజు ఆనేం,మాధురి హీరో హీరోయిన్లు గా, సీనియర్ నటులు గౌతమ్ రాజు,కమెడియన్ భద్రం,కిశోరో దాస్, జబర్దస్త్ శాంతి స్వరూప్ ,శోభన్ బాబు భోగరాజు లాంటి నటులు ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. కథ మాటలు  శివ కాకు అందించారు. 
 
 
నిర్మాత శంకర్ కొప్పిశెట్టి మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు 140 సినిమాలకి పంపిణీ దారుణిగా చేసాను, తేజ హనుమాన్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి మరిన్నీ మంచి కథలని ప్రేక్షకులకు అందించాలని అనుకుంటున్నాను.
 
రచన :శివ కాకు
కెమేరా : ఆర్ ఎస్ శ్రీకాంత్
సంగీతం : వి.ఆర్.ఏ ప్రదీప్, పవన్
నటి నటులు : రాజు ఆనేం, మాధురి, గౌతమ్ రాజు, భద్రం, కిషోర్ దాస్, జబర్దస్త్ శాంతి స్వరూప్, శోభన్ బాబు భోగరాజు,