తార‌క్ న‌ట‌న‌కు ద‌ర్శ‌కేంద్రుడు ఫిదా

Published On: September 22, 2017   |   Posted By:
తార‌క్ న‌ట‌న‌కు ద‌ర్శ‌కేంద్రుడు ఫిదా
యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్రం `జై ల‌వ‌కుశ‌`. కె.ఎస్‌.బాబీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ నిర్మించారు. సెప్టెంబ‌ర్ 21న సినిమా విడుద‌లైంది. సినిమా పాజిటివ్ టాక్‌తో క‌లెక్ష‌న్స్ ప‌రంగా అద‌ర‌గొడుతూ సాగిపోతుంది.
ముఖ్యంగా జై పాత్ర‌లో ఎన్టీఆర్ అద‌ర‌గొట్టాడంటూ అభిమానులు, ప్రేక్ష‌కులే కాకుండా విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంసించారు. అంతేకాదు రాజ‌మౌళి లాంటి అగ్ర ద‌ర్శ‌కుడు సైతం.. జై పాత్ర‌లో ఎన్టీఆర్‌ని చూసి నా హృదయం గ‌ర్వంతో ఉప్పొంగింది. మాట‌లు రావ‌డం లేదు. జై జై జైల‌వ‌కుశ అని ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే.
ఇప్పుడు రాజమౌళి గురువు కె.రాఘ‌వేంద్ర‌రావు కూడా తార‌క్ న‌ట‌న‌కు ఫిదా అయిపోయాడు.  నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.
నెగ‌టివ్ షేడ్ ఉన్న జై పాత్ర‌లో ఎన్టీఆర్ త‌నదైన న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పిస్తున్నాడు మ‌రి. ఇప్పుడు ఈ లిస్టులో ఇంకెంత‌మంది చేరుతారో చూడాలి.