తిప్ప‌రామీసం టీజ‌ర్ విడుద‌ల‌

Published On: September 6, 2019   |   Posted By:
తిప్ప‌రామీసం టీజ‌ర్ విడుద‌ల‌
 
శ్రీవిష్ణు హీరోగా రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌, శ్రీ ఓం సినిమా ప‌తాకాల‌పై కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `తిప్ప‌రామీసం`. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. ద‌ర్శ‌కుడు కృష్ణ విజ‌య్ శ్రీవిష్ణుని ఆవిష్క‌రించిన తీరు, లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.
 
`మందు, సిగ‌రెట్‌, అమ్మాయిలా.. శత్రువు కూడా వ్య‌స‌న‌మే.. ఆ వ్య‌స‌నానికి నేనూ బానిస‌నే..“ అనే టీజ‌ర్ డైలాగ్‌, టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. నిక్కీ తంబోలి హీరోయిన్‌గా న‌టిస్తుంది. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రానికి సిద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి త‌దిత‌రులు

 సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ విజ‌య్‌.ఎల్‌
బ్యాన‌ర్స్‌: రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌, శ్రీ ఓం సినిమా
మ్యూజిక్‌:  సురేశ్ బొబ్బిలి
కెమెరా:  సిద్‌
ఎడిట‌ర్‌: ధ‌ర్మేంద్ర కాక‌రాల‌
ఆర్ట్‌: ష‌ర్మిల ఎలిశెట్టి
పాట‌లు:  పూర్ణాచారి, అల‌రాజా
క్రియేటివ్ హెడ్‌:  విజ‌యేంద్ర మండల‌
కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌:  శ‌శి కిర‌ణ్‌
ఫైట్స్‌:  రామ‌కృష్ణ‌, రియ‌ల్ స‌తీశ్‌
కొరియోగ్ర‌ఫీ:  స‌తీశ్ శెట్టి, బాబీ, విజ‌య్‌