తిరులమ శ్రీవారిని దర్శించుకున్న అజిత్

Published On: July 18, 2017   |   Posted By:

తిరులమ శ్రీవారిని దర్శించుకున్న అజిత్

హీరో అజిత్ మరోసారి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో వివేగమ్  అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉన్న టైమ్ లోనే అజిత్ వరుసగా మూడోసారి శ్రీవారిని దర్శించుకోవడం విశేషం. ఈ సినిమా సక్సెస్ కోసం అజిత్ ఎంత పరితపిస్తున్నాడనే విషయం తిరుమల సందర్శనతోనే అర్థమౌతోంది.

వివేగమ్ సినిమాలో చాలా రిస్కీ ఫైట్స్ చేశాడు అజిత్. కంప్లీట్ యాక్షన్ ఎఁటర్ టైనర్ గా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో కారు ఛేజింగ్ తో పాటు మొత్తం 6 భారీ ఫైట్స్ ఉన్నాయి. ఒక టైమ్ లో చేతికి ఫ్రాక్చర్ కూడా అయింది. ఆ తర్వాతే వరుసగా శ్రీవారిని దర్శించుకుంటూ వస్తున్నాడు అజిత్. త్వరలోనే తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తెలుగు రైట్స్ కోసం ప్రస్తుతం భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.