తెలుగులోకి డెబ్యూ చేస్తున్న త‌మిళ సీనియ‌ర్ హీరో

Published On: September 26, 2017   |   Posted By:

తెలుగులోకి డెబ్యూ చేస్తున్న త‌మిళ సీనియ‌ర్ హీరో

న‌టుడుగా 21 ఏళ్ల క్రితం రంగ ప్ర‌వేశం చేశాడు హీరో మాధ‌వ‌న్‌. త‌మిళం, హిందీ, క‌న్న‌డం, మ‌ల‌యాళ సినిమాల్లో ప‌లు చిత్రాల్లో మాధ‌వ‌న్ న‌టించారు. కానీ తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు స్ట్ర‌యిట్ మూవీ చేయ‌నేలేదు. అయితే చెలి, స‌ఖి, యువ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. ఇప్పుడు ఈ సీనియ‌ర్ హీరో స్ట్ర‌యిట్ తెలుగు మూవీలో న‌టించ‌బోతున్నాడు. నాగ‌చైత‌న్య హీరోగా కార్తికేయ‌, ప్రేమ‌మ్ చిత్రాల దర్శ‌కుడు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కాంబినేష‌న్‌లో `స‌వ్య‌సాచి` అనే సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీల‌క‌పాత్ర‌లో మాధ‌వ‌న్ న‌టించ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే మాధ‌వ‌న్ న‌టించబోయే తొలి తెలుగు స్ట్ర‌యిట్ మూవీ `స‌వ్య‌సాచి` అవుతుంది.