తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో రాజుగారి గది-2 షేర్

Published On: October 20, 2017   |   Posted By:
 తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో రాజుగారి గది-2 షేర్
నాగార్జున, సమంత కీలకపాత్రలు పోషించిన రాజుగారి గది-2 సినిమా వారం రోజులు పూర్తిచేసుకుంది. అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది. విడుదలైన మొదటి 3 రోజులు డీసెంట్ వసూళ్లు రాబట్టి రాజుగారి గది-2 సినిమా.. వారం రోజులు ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల 75 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. అటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 27 కోట్ల 80 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది.
మీడియం రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిన రాజుగారి గది-2 సినిమా విడుదలైన 3 రోజులకే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైంది. టైట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లంతా బ్రేక్ ఈవెన్ సాధించారు. అలా సూపర్ ప్రాఫిటబుల్ వెంచర్ గా పేరుతెచ్చుకున్న ఈ సినిమా, నాగార్జున కెరీర్ లో మరో హిట్ మూవీగా నిలిచింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో రాజుగారి గది-2 వసూళ్లు (షేర్)
నైజాం – రూ. 5.70 కోట్లు
సీడెడ్ – రూ. 2.23 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.55 కోట్లు
ఈస్ట్ – రూ. 1.05 కోట్లు
వెస్ట్ – రూ. 0.65 కోట్లు
గుంటూరు – రూ. 1.10 కోట్లు
కృష్ణా – రూ. 0.99 కోట్లు
నెల్లూరు – రూ. 0.48 కోట్లు
మొత్తం షేర్ వసూళ్లు – రూ. 13. 75 కోట్లు