తేజ్ ఐ లవ్ యు మూవీ షూటింగ్ పూర్తి

Published On: May 19, 2018   |   Posted By:

తేజ్ ఐ లవ్ యు మూవీ షూటింగ్ పూర్తి

కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సాయి ధరమ్ తేజ్ సినిమా తేజ్ ఐ లవ్ యు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూర్తయింది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా ఫస్ట్ ఫీల్ పేరిట రిలీజైన ఈ సినిమా టీజర్ అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు షూటింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడంతో, ఈ సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో చేపట్టనున్నారు.

పారిస్ లోని అందమైన లొకేషన్స్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.ఇప్పటికే సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ కూడా ప్రారంభమైంది. జూన్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు  నిర్మాతలు..క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి K.S. రామారావు ప్రొడ్యూసర్. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజర్. అనుపమ పరమేశ్వరన్ ఇందులో తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది