తొలిప్రేమ టీజర్ రివ్యూ

Published On: December 20, 2017   |   Posted By:
తొలిప్రేమ టీజర్ రివ్యూ

“మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చి వెళ్లినా, మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మరిచిపోలేం.” తొలిప్రేమ టీజర్ లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్ తో సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని ఎవరైనా గెస్ చేయొచ్చు. అసలు ఈ సినిమాకు తొలి ప్రేమ అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా అర్థమైపోతుంది.
ఇక టీజర్ విషయానికొస్తే వరుణ్ తేజ్ ఇందులో సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఎన్నారై అబ్బాయి క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడేమో అనే అనుమానం కలుగుతుంది. ఆ అనుమానాలకు మరింత తావిస్తూ విజువల్స్ అన్నీ లండన్ లో తీశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో లవ్ ఎలిమెంట్స్ ను మరింత ఎలివేట్ చేసింది. జార్జ్ విలియమ్స్ కెమెరా పనితనం కనిపిస్తోంది.
శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది తొలిప్రేమ.