తొలిప్రేమ సినిమాకు ఓవర్సీస్ 10 లక్షల డాలర్లు

Published On: February 24, 2018   |   Posted By:
తొలిప్రేమ సినిమాకు ఓవర్సీస్ 10 లక్షల డాలర్లు
వరుణ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తొలిప్రేమ సినిమా ఓవర్సీస్ లో మరో ఘనత సాధించింది. ఈ సినిమాకు అక్కడ 10 లక్షల డాలర్లు వచ్చాయి. ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన హీరోగా వరుణ్ తేజ్ రికార్డు సృష్టించాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన ఫిదా సినిమా కూడా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది. తొలిప్రేమ సినిమాతో ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా వరుణ్ తేజ్ కు మార్కెట్ పెరిగింది.
వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేశారు. 12 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.