తొలిప్రేమ సెన్సార్ పూర్తి రెడీ ఫర్ రిలీజ్

Published On: February 7, 2018   |   Posted By:
తొలిప్రేమ సెన్సార్ పూర్తి రెడీ ఫర్ రిలీజ్
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలో రానున్న తొలిప్రేమ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. వరుణ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సెన్సార్ అధికారులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా నిడివి 136 నిమిషాల 6 సెకెన్లు ఉంది. వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఈనెల 10న థియేటర్లలోకి తీసుకురానున్నారు. యూఎస్ లో మాత్రం 9 నుంచే ప్రదర్శనలు ప్రారంభంకానున్నాయి.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు హోల్ సేల్ గా కొనేశారు. అలా విడుదలకు ముందే బీవీఎస్ఎన్ ప్రసాద్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోగా… ఫిదా సక్సెస్ తో ఈ సినిమాను ఫ్యాన్సీ రేటుకు అమ్మారు దిల్ రాజు. పైగా ఇప్పటికే సినిమా చూసిన దిల్ రాజు మూవీపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.