తొలి చిత్రానికి భిన్నంగా క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌

Published On: April 19, 2018   |   Posted By:

తొలి చిత్రానికి భిన్నంగా క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌

ద‌ర్శ‌కుడు  ప్రియ‌దర్శన్‌, లిజీల త‌న‌య క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ తెలుగు చిత్రం `హ‌లో` ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఈ చిత్రంలో మోడ్ర‌న్ అమ్మాయిగా మెప్పించిన క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ ఇప్పుడు శ‌ర్వానంద్‌, సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. వివ‌రాల ప్ర‌కారం ఈ చిత్రంలో క‌ల్యాణి ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. 80 ద‌శకం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాలో శ‌ర్వానంద్ మాఫియా డాన్‌గా క‌న‌ప‌డ‌నున్నారు. క‌థ ప్ర‌కారం అప్ప‌టి కాలానికి చెందిన ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌ల్యాణి మెప్పించ‌నుంద‌ని టాక్‌. ఆల్ రెడీ ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు మ‌రో షెడ్యూల్‌ను చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.