త్రివిక్ర‌మ్ ఓ లెక్క‌తోనే చేస్తున్నాడు

Published On: August 5, 2017   |   Posted By:
త్రివిక్ర‌మ్ ఓ లెక్క‌తోనే చేస్తున్నాడు
ప‌వ‌ర్‌స్టార్‌ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ మంచి స్నేహితులు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా అంటేనే ఎంత భారీ అంచ‌నాలుంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రానుంది. ఇక్కడొక విష‌యం ఉంది. అదేంటంటే త్రివిక్ర‌మ్‌.. టాలీవుడ్ లో ఈ పేరంటేనే ఒక బ్రాండ్‌.  మాట‌ల ర‌చ‌యిత‌గా కెరీర్‌ని ప్రారంభించి ప్ర‌స్తుతం లీడింగ్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రిగా దూసుకుపోతున్న త్రివిక్ర‌మ్‌.. ఇప్ప‌టికి 8 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వాటిలో ఒక సినిమా మిన‌హాయిస్తే మిగిలిన‌వ‌న్నీ విజ‌యం సాధించాయి.
ప్ర‌స్తుతం త‌న తొమ్మిదో చిత్రాన్ని త‌న‌కు బాగా అచ్చొచ్చిన క‌థానాయ‌కుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. విశేష‌మేమిటంటే.. ప‌వ‌న్‌తో త్రివిక్ర‌మ్ రూపొందించే సినిమాలన్నీ ఓ లెక్క ప్ర‌కారం సాగుతుండ‌డం. ప‌వ‌న్ కాంబినేష‌న్‌లో త్రివిక్ర‌మ్ రూపొందించిన తొలి చిత్రం జ‌ల్సా.. స‌ద‌రు ద‌ర్శ‌కుడికి 3వ చిత్ర‌మైతే, ఆ త‌రువాత అదే కాంబోలో వ‌చ్చిన అత్తారింటికి దారేది 6వ చిత్రం. ఇప్పుడు తెర‌కెక్కిస్తున్న కొత్త చిత్రం త్రివిక్ర‌మ్‌కి ద‌ర్శ‌కుడిగా 9వ చిత్రం. మొత్త‌మ్మీద ప‌వ‌న్ విష‌యంలో త్రివిక్ర‌మ్ లెక్క మూడో ఎక్కంలాగానే అనిపిస్తుంది మ‌రి. ఈ లెక్క‌ బాగానే ఉందిగా మ‌రి.